PM Kisan: ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ డబ్బులు.. జాబితాలో మీ పేరు ఉందా? చెక్ చేసుకోండిలా!
PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి సోమవారం జమకానున్నాయి. అర్హుల జాబితాలో మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్‌చేసుకోవచ్చు.
దిల్లీ: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) డబ్బులు సోమవారం బ్యాంకుల్లో జమకానున్నాయి. 13వ విడత కింద అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని తెలిపారు. ఎవరైతే ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేస్తారో వారి ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.
దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటిదాకా ఈ పథకం కింద 12 విడతలుగా నిధులను విడుదల చేసింది. సోమవారం (ఫిబ్రవరి 27న) 13వ విడత నిధులు విడుదల చేయనుంది. ఈ-కేవైసీ చేయించుకున్న వారిని లబ్దిదారులుగా గుర్తించి వారి ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది. అయితే, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు.
- తొలుత https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఈ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే(https://pmkisan.gov.in) మరో పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.
- అక్కడ లబ్ధిదారుని రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకుని ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
- ఏదైనా సమచారం కోసం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబరు 155261 / 011-24300606కు కాల్ చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Chiranjeevi: ఛారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. చిరంజీవి ఆసక్తికర పోస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Festival shopping: మెగా సేల్స్‌కు రెడీనా..? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
-
Crime News: ఖాకీ తెలివి.. హత్యచేసి.. ఆపై బతికుందని రెండేళ్లు నమ్మించి..!
-
Pawan Kalyan: గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది: పవన్