Modi: రేపు కాశీకి ప్రధాని.. ఎందుకంటే? 

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.....

Published : 14 Jul 2021 19:13 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు దాదాపు రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లోని  ఎంసీహెచ్‌లో 100 పడకల ఆసత్పత్రితో పాటు  మల్టీ పార్కింగ్‌, గంగా నదిలో పర్యాటకాభివృద్ధికి ఉద్దేశించిన రోరో బోట్లను ప్రధాని ప్రారంభించనున్నారు. దీంతో పాటు వారణాసి- ఘాజీపూర్ జాతీయ రహదారిపై నిర్మించిన మూడు లైన్ల ఫ్లైఓవర్‌ వంతెనను ప్రారంభిస్తారు. 

అలాగే, మధ్యాహ్నం 12.15 గంటలకు జపాన్‌ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ‘రుద్రాక్ష్‌’ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు బీహెచ్‌యూలోని మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని ప్రధాని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత వైద్యులు, ఉన్నతాధికారులతో కరోనా సన్నద్ధతపై సమీక్షిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని