Parliament: 17 కేటగిరీలుగా అత్యంత కాలుష్య కారక పరిశ్రమలు

అత్యంత కాలుష్య కారక పరిశ్రమలను 17 కేటగిరీలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిమెంట్‌, థర్మల్‌, స్టీల్‌ప్లాంట్‌ సహా మొత్తం 17 రకాల పరిశ్రమలను అత్యంత కాలుష్య కారక పరిశ్రమలుగా విభజించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ అశోక్‌ బాజ్‌పాయ్‌ కాలుష్య ప్రమాణాలపై

Published : 09 Aug 2021 23:54 IST

దిల్లీ: అత్యంత కాలుష్య కారక పరిశ్రమలను 17 కేటగిరీలుగా విభజించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిమెంట్‌, థర్మల్‌, స్టీల్‌ప్లాంట్‌ సహా మొత్తం 17 రకాల పరిశ్రమలను అత్యంత కాలుష్య కారక పరిశ్రమలుగా విభజించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ అశోక్‌ బాజ్‌పాయ్‌ కాలుష్య ప్రమాణాలపై లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. అశోక్‌ బాజ్‌పాయ్‌ అడిగిన ప్రశ్నకు పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే జవాబిచ్చారు. కాలుష్య ప్రమాణాల మేరకు వీటిని నోటిఫై చేసినట్లు పార్లమెంటుకు తెలిపారు. అత్యంత కాలుష్య కారక జాబితాలో బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలు లేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని