రాహుల్‌, ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు

యూపీలోని హాథ్రస్‌కు బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా వారి కాన్వాయ్‌ని గ్రేటర్‌......

Published : 01 Oct 2020 14:52 IST

 

దిల్లీ: యూపీలోని హాథ్రస్‌కు బయల్దేరిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా వారి కాన్వాయ్‌ని గ్రేటర్‌ నోయిడా వద్ద నిలిపివేశారు. దీంతో కాన్వాయ్‌ దిగి రాహుల్‌, ప్రియాంక రోడ్డు మార్గంలో నడక ప్రారంభించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా వారి వెంట ఉన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు బాధితురాలి సొంత గ్రామంలో సెక్షన్‌ 144 నిబంధనను విధించారు. రాకపోకలను నియంత్రించేందుకు వీలుగా గ్రామం చుట్టుపక్కల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం అనంతరం.. నిందితులు ఆమె గొంతు నులిమి చంపటానికి ప్రయత్నించటంతో ఆమె నాలుక కొంత మేరకు తెగిపోయినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. తీవ్రగాయాలతో దిల్లీలో చికిత్స పొందుతున్న బాధితురాలు మంగళవారం మృతి చెందారు. అనంతరం ఆమె మృతదేహాన్ని దిల్లీ నుంచి హాథ్రస్‌కు తరలించిన పోలీసులు.. బుధవారం తెల్లవారు ఝామున 2:30 నిముషాలకు గుట్టుచప్పుడు కాకుండా అంత్య క్రియలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమయ్యింది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని