JEE Main Results: ఒకట్రెండు రోజుల్లో జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం!

జేఈఈ మెయిన్‌ (నాలుగో సెషన్‌) ఫలితాల విడుదల విషయంలో అధికారులు విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో.....

Updated : 13 Sep 2021 19:27 IST

ఫలితాల కోసం 4 రోజులుగా నిరీక్షణ.. ఎన్‌టీఏ తీరుపై విద్యార్థుల అసహనం

దిల్లీ: జేఈఈ మెయిన్‌ (నాలుగో సెషన్‌) ఫలితాల విడుదల విషయంలో అధికారులు విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. జేఈఈ మెయిన్‌ ర్యాంకుల వెల్లడిలో జాప్యంపై ఎన్‌టీఏ తీరు పట్ల అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 7లక్షల మంది విద్యార్థులు నాలుగు రోజులుగా ఈ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) స్పష్టతనివ్వకపోవడంతో ఆ సంస్థ తీరుపై విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం, అసహనం వ్యక్తంచేస్తున్నారు. 

అటు, జేఈఈ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్లలోనూ గందరగోళం నెలకొంది. ఈ నెల 11న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ నెల 10నాటికి  జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కాకపోవడంతో అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియను ఐఐటీ ఖరగ్‌పూర్‌ వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు ఉంటాయని ఐఐటీ - ఖరగ్‌పూర్‌ ప్రకటించినప్పటికీ జేఈఈ మెయిన్ ర్యాంకుల విడుదలలో జాప్యం వల్ల ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. జేఈఈ మెయిన్‌లో మొదటి రెండున్నర లక్షల మంది ర్యాంకర్లకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. మరోవైపు, జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఫలితాలను jeemain.nta.nic.in, nta.ac.inntaresults.nic.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని