‘సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చిస్తున్నాం’

భారత్‌, చైనాల సరిహద్దు వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్‌ ఇండియా ఎకనమిక్‌ ఫోరం సభ్యుడు..........

Published : 16 Oct 2020 02:22 IST

దిల్లీ: భారత్‌, చైనా మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన బ్లూంబర్గ్‌ ఇండియా ఎకనమిక్‌ ఫోరం సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘భారత్‌, చైనా సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఫలితం ఏంటనేది గోప్యతకు సంబంధించిన విషయం’ అని ఆయన అన్నారు.

భారత్‌, చైనా మధ్య 1993 సరిహద్దులో శాంతి ఒప్పందం జరిగాక పరిస్థితులు మెరుగుపడ్డాయని జైశంకర్‌ గుర్తు చేశారు. ఆ ఒప్పందం తర్వాత గత 30 సంవత్సరాల్లో ఇరు దేశాల సరిహద్దుల్లో మంచి సంబంధాల్ని నిర్మించామన్నారు. ఇకముందు ఆ రకమైన పరిస్థితులు కొనసాగకపోతే ఆ ఒప్పందానికి విలువ ఉండదన్నారు. టిబెట్‌ సరిహద్దు పరిస్థితుల గురించి జైశకంర్‌ను ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం లద్దాఖతో సంబంధం లేని ఇతర సమస్యల్లోకి ప్రవేశించాలని నేను అనుకోవడం లేదు’ అని సమాధానమిచ్చారు.

గత ఐదు నెలలుగా భారత్‌, చైనా మధ్య వాస్తవాధీన రేఖ విషయమై సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా తాము అంగీకరించబోమంటూ చైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై గురువారం స్పందించిన భారత్‌.. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ డ్రాగన్‌కు దీటుగా బదులిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని