Booster Dose: బూస్టర్‌ డోసుకు అనుమతించండి.. కేంద్రానికి గహ్లోత్‌ విజ్ఞప్తి

రాజస్థాన్‌లో పలు జిల్లాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నందున మూడో డోసు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Updated : 27 Feb 2024 20:26 IST

ప్రధాని మోదీకి రాజస్థాన్‌ సీఎం విజ్ఞప్తి

జయపుర: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే టీకాకు అర్హులైన 80శాతం మందికి ఒకడోసు అందించగా.. 41శాతం మందికి పూర్తి మోతాదుల్లో కొవిడ్‌ టీకా అందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బూస్టర్‌ డోసు (మూడో డోసు) పంపిణీ చేపట్టాలనే వాదనలు మొదలయ్యింది. రాజస్థాన్‌లో పలు జిల్లాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నందున మూడో డోసు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై త్వరలోనే ప్రధానమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు.

రాజస్థాన్‌లో సీజనల్‌ వ్యాధులు, కొవిడ్‌ తీవ్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తాజాగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెండు డోసులు అందించినప్పటికీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో మూడో వేవ్ ముప్పు తొలగేందుకు బూస్టర్‌ డోసు అందించడమే ఉత్తమనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దాదాపు 35 దేశాలు బూస్టర్‌ డోసు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ విషయంపై త్వరలోనే ప్రధానమంత్రికి లేఖ రాస్తానని అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని