MGNREGA: బకాయిల వివాదం.. 50లక్షల లెటర్లతో తృణమూల్‌ సిద్ధం!

జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ 50లక్షల లెటర్లను కేంద్ర మంత్రికి పంపించనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌ వెల్లడించింది.

Published : 26 Sep 2023 18:22 IST

కోల్‌కతా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) నిధుల విడుదల విషయంలో పశ్చిమ బెంగాల్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండు చేస్తూ దేశ రాజధానిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 50లక్షల లెటర్లనూ కేంద్ర మంత్రికి పంపించనున్నట్లు తెలిపింది.

‘ఉపాధిహామీ పథకం కింద పని చేస్తున్నప్పటికీ బకాయిలు మాత్రం విడుదల చేయడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని నిశ్చయించాం. ఇప్పటివరకు 50లక్షల లేఖలను సేకరించాం. ప్రధాని మోదీ కార్యాలయంతోపాటు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు వీటిని పంపిస్తాం. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ పోరాడుతుంది’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించడంతోపాటు మరుసటి రోజు నగరంలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.

‘మామ’ మనసులో కుర్చీ టెన్షన్‌.. అసెంబ్లీ సీటుపై సస్పెన్స్‌!

ఉపాధి హామీ పథకంతోపాటు గ్రామీణ్‌ ఆవాస్‌ యోజనకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన రూ.15వేల కోట్లను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిలుపుదల చేసిందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దీంతో  దేశ రాజధానిలో నిరసనలకు సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోసం ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు రాలేదని సమాచారం. ఈ క్రమంలోనే కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు లేఖలను పంపిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని