Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్‌ నుంచి విముక్తి!

పాక్‌జైళ్లలో (Pak Jails) ఉంటున్న 200 మంది భారత మత్స్యకారులకు (Fishermen) ఇవాళ విముక్తి లభించనుంది. నెల రోజుల వ్యవధిలో భారత జాలర్లు విడుదల కానుండటం ఇది రెండోసారి.

Published : 01 Jun 2023 23:21 IST

దిల్లీ: పాక్‌ జైళ్లలో (Pak Jails) ఉన్న 200 మంది భారత జాలర్లను (Indian Fishermen) అక్కడి ప్రభుత్వం విడుదల చేయనుంది. వివిధ సందర్భాల్లో పొరపాటున పాక్‌ ప్రాదేశిక జలాల్లోకి వెళ్లి చేపలు పడుతుండగా.. వీరిని అక్కడి భద్రత దళాలు పట్టుకున్నాయి. గత కొన్నేళ్లుగా వందల మంది మత్స్యకారులు పాక్‌ జైళ్లలో మగ్గిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్‌ అధికారులు పాక్‌తో సంప్రదింపులు జరపగా.. వారిని విడిచిపెట్టేందుకు అంగీకరించారు. మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు రాత్రికి అప్పగించనున్నారు.

నెల రోజుల వ్యవధిలో పాక్‌ జైళ్ల నుంచి భారత మత్స్యకారులు విడుదల కావడం ఇది రెండోసారి. తొలి విడతగా మే 12న 198 మంది మత్స్యకారులను మలీర్‌ జైలు నుంచి పాక్‌ విడుదల చేసింది. నిజానికి 200 మందిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, ఇద్దరు జైలులోనే మరణించడంతో.. 198 మందినే భారత్‌కు అప్పగించింది. ఇద్దరిలో జుల్ఫికర్‌ అనే వ్యక్తి మే 6న, సోమదేవ అనే మరో వ్యక్తి మే 9న అనారోగ్య కారణాల వల్ల మృతి చెందినట్లు భారత్‌కు సమాచారం అందించింది. మూడో విడతగా జులై 3న మరో 100 మంది మత్స్యకారులు విడుదల కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని