పది తలల రావణునిగా సైఫ్‌ అలీఖాన్‌...!

‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ చలన చిత్ర చరిత్రను తిరగ రాసిన అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. ఆయన నటించనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేష్‌ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలోని ‘లంకేష్‌’ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

Published : 05 Dec 2020 01:03 IST

హైదరాబాద్‌:  ప్రభాస్‌ నటించనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేష్‌ పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలోని ‘లంకేష్‌’ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పది తలకాయలతో బాలీవుడ్‌ నటుడు ‘రావణునిగా’ కనిపించారు. అంతేకాకుండా కింది భాగంలో ‘బాణం పట్టుకొని రాముని’ రూపం ఉంది.

ఈ చిత్రంలోని తన పాత్రను దర్శకుడు ఓం రావత్‌ చాలా అద్భుతంగా మలిచారన్నారు. అంతేకాకుండా ‘ఇలాంటి రాక్షసప్రభువు వంటి పాత్ర చేయటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ, సీతని అపహరించినందుకు, రామునితో యుద్దానికి దారి తీసిన పరిస్థితులను, తన చెల్లి శూర్పణఖ విషయంలో లక్ష్మణుడు చేసిన పనికి ప్రతీకారం తీసుకునేందుకు.. వీటన్నింటికీ న్యాయం చేస్తూ ఎంటర్‌టైనింగ్‌గా మనిషిగా చూపించే ప్రయత్నం చేశారు’.అని మొదటిసారిగా ఈ చిత్రంలోని తన పాత్ర గురించి సైఫ్‌ తెలిపారు.

ఈ చిత్రంలో కృతి సనన్‌ ‘సీత’ పాత్రలో కథానాయికగా నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ‘అవతార్‌’, ‘స్టార్‌ వార్స్‌’ చిత్రాల వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్స్‌తో ఈ చిత్రానికి సంబంధించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గ్రీన్‌ మ్యాట్‌ టెక్నాలజీపై ఈ చిత్ర నిర్మాణం జరగనుంది. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో ఆగస్టు 11న, 2022లో విడుదల చేయనున్నారు. 

 


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు