Dhanush: రాయన్‌ వస్తున్నాడు

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్‌’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు.

Updated : 07 May 2024 09:37 IST

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్‌’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జె.సూర్య, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అందులో ధనుష్‌ మంటల మధ్య ఉన్న ఇటుకలపై కూర్చొని సీరియస్‌గా చూస్తున్న తీరు.. బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తున్న పదితలల రావణుడి కటౌట్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ చిత్ర తొలి గీతాన్ని ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్‌తోనే స్పష్టత ఇచ్చారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. ఓం ప్రకాశ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని