Samantha: నిజమైన బలం అదే

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత  నిర్ణయించుకుందా? ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్ట్‌ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది.

Updated : 07 May 2024 09:41 IST

సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత  నిర్ణయించుకుందా? ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్ట్‌ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పంచుకున్న ఫొటోలపై  సామాజిక మాధ్యమాల్లో చర్చలు నడిచాయి. ఈ చర్చలకి, సామాజిక మాధ్యమాల్లో వెలువడిన రకరకాల అభిప్రాయాలకి పుల్‌స్టాప్‌ పెట్టేలా సమంత స్పందిస్తుందని ఆశించారంతా. కానీ ఆమె ఈ తతంగాన్నంతా తేలిగ్గా తీసుకున్నారు. ‘‘మిమ్మల్ని మీరు నిరూపించుకోవల్సిన అవసరం లేకుండా మీ ఉనికిని చాటుకోవడమే నిజమైన బలం...’’ అనే వ్యాఖ్యని పంచుకుంటూ ఆమె తన అంతరంగాన్ని చెప్పకనే చెప్పారు. ఇటీవలే ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని ప్రకటించారు. ఆమె సొంత నిర్మాణంలోనే రూపొందనున్న ఈ సినిమాతో త్వరలోనే బిజీ కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని