‘మాది ఓవర్ యాక్షన్‌ ఫ్యామిలీ’ : సుమ

సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులతో కలిసి సుమ చేసే సందడి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ..

Published : 24 Dec 2020 00:54 IST

హైదరాబాద్: సుమ వ్యాఖ్యాతగా ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్’ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులతో కలిసి సుమ చేసే సందడి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈసారి ‘మా వింత గాధ వినుమా’, ‘కమిట్‌మెంటల్‌’ చిత్రాల టీమ్‌ సభ్యులు కలిసి ‘క్యాష్’ సెట్ లో సందడి చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

షోలో భాగంగా సుమ ‘కమిట్‌మెంటల్‌’ నటీనటులతో కలిసి పెళ్లి స్ఫూఫ్‌తో ‘మాది ఓవర్‌ యాక్షన్‌ ఫ్యామిలీ’ అంటూ కడుపుబ్బా నవ్వించారు. అలాగే ‘మా వింత గాధ వినుమా’ వర్సెస్‌ ‘కమిట్‌మెంటల్‌’ అంటూ క్రికెట్ లీగ్‌తో నవ్వులు పూయించారు. సుమ బాస్కెట్ బాల్ లీగ్ వార్తల్లో భాగంగా ‘ఇండస్ట్రీలో మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? శ్రీముఖి లేదా రాహుల్ సిప్లిగంజ్‌?’ అని సుమ పునర్నవిని ప్రశ్నించగా.. ‘శ్రీముఖి’ అనగా.. దానికి సుమ ‘రాహుల్ మనసును పునర్నవి కొల్లగొట్టిందా లేదా బ్రేకప్‌ చెప్పిందా’ అంటూ సరదాగా పంచులతో నవ్వుల వర్షం కురిపించారు. ఈ నవ్వుల పరిమళాల్ని ఆస్వాదించాలంటే వచ్చే శనివారం (డిసెంబర్‌ 26)న ప్రసారం కానున్న ‘క్యాష్’ కార్యక్రమాన్ని చూడాల్సిందే.. అప్పటివరకు ఈ ప్రోమోను తిలకించండి..!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని