పప్పూసేన నన్ను మిస్‌ అవుతోంది: కంగన

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార పార్టీని పప్పూసేన అని విమర్శించారు. తన మనసుకి ఏది అనిపిస్తే అది ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడేస్తూ తరచూ ఆమె చిక్కుల్లో పడుతుంటారనే విషయం తెలిసిందే. ట్విటర్‌ వేదికగా ఎప్పటికప్పుడు...

Published : 18 Oct 2020 11:43 IST

మహారాష్ట్ర ప్రభుత్వంపై నటి విమర్శలు

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార పార్టీని పప్పూసేన అని విమర్శించారు. కంగన ట్విటర్‌ వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటారు. అయితే  కంగన, ఆమె సోదరి రంగోలీ సోషల్‌మీడియా వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా పోస్టులు పెడుతున్నారని పేర్కొంటూ ఇటీవల ఓ వ్యక్తి బాంద్రా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. సమగ్ర విచారణ అనంతరం కంగన, రంగోలీపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ముంబయి పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది.

కాగా, కేసు నమోదు చేయడం గురించి కంగన తాజాగా స్పందించారు. ‘నవరాత్రి రోజున ఎవరెవరు ఉపవాసం ఉంటున్నారు?దుర్గాపూజ అనంతరం నేను కూడా ఉపవాసం చేస్తున్నాను. నాపై మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. చూస్తుంటే పప్పూసేనకు నాపై అభిమానం ఎక్కువగా ఉన్నట్లు ఉంది. అందుకే నన్ను వదల్లేకపోతున్నారు. నన్ను ఎక్కువగా మిస్‌ కాకండి. త్వరలోనే నేను అక్కడికి వస్తా’ అని కంగన వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ముంబయిని పీవోకేతో పోలుస్తూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను దూషిస్తూ పోస్టులు పెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని