ఎ-గ్రేడ్‌ నాయిక ఎలా అవ్వాలంటే..

కథానాయికలు కంగనా రనౌత్‌-తాప్సిల మధ్య కొద్దిరోజులుగా ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాప్సి బి-గ్రేడ్‌ నటి అంటూ..

Updated : 28 Jul 2020 15:11 IST

తాప్సీకి దీటుగా బదులిచ్చిన కంగనా టీం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయికలు కంగనా రనౌత్‌-తాప్సిల మధ్య కొద్దిరోజులుగా ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాప్సి బి-గ్రేడ్‌ నటి అంటూ ఓ ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆ వ్యాఖ్యలపై స్పందించిన తాప్సి కంగనాకు చురకలంటించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను తాను ఎ-జాబితా నాయికగా  పరిగణించుకోలేదని, మరి కంగనా ఎలా అయిందో తనకు తెలియదని పేర్కొంది.

తాప్సి చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా టీం బదులిచ్చింది. ఎ-గ్రేడ్‌ నాయికగా మారాలంటే ఏం చేయాలో తెలిపింది. ‘‘మంచి నటన. బలమైన వ్యక్తిత్వం. వీటన్నింటికి మించి క్వీన్‌, తను వెడ్స్‌ మను, మణికర్ణిక లాంటి నాయికా ప్రాధాన్యమున్న హిట్‌ చిత్రాలు. ఇవేవీ కాకపొయినా ఓ సోలో హిట్‌ చిత్రం నిన్ను ఎ-గ్రేడ్‌‌ నాయికను చేస్తుంది. గో తాప్సి’ అంటూ కంగనా టీం ట్విటర్‌లో దీటుగా సమాధానమిచ్చారు. తాప్సి ఇంటర్వ్యూ స్క్రీన్‌షాట్‌లను కూడా అందులో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని