Cinema News: కర్మయోగి చరిత్ర

తల్లిదండ్రుల సేవలోనే శివపార్వతుల దర్శనం ఉందని నిరూపించిన కర్మయోగి ధర్మవ్యాధుడి కథతో మా చిత్రం రూపొందిందన్నారు బి.జె.రాజా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర’. ఉల్కందేకార్‌ మురళీధర్‌ నిర్మిస్తున్నారు. విజయ్‌ భాస్కర్‌, అనుషా, అశోక్‌కుమార్‌,

Updated : 23 Feb 2022 08:12 IST

ల్లిదండ్రుల సేవలోనే శివపార్వతుల దర్శనం ఉందని నిరూపించిన కర్మయోగి ధర్మవ్యాధుడి కథతో మా చిత్రం రూపొందిందన్నారు బి.జె.రాజా. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కర్మయోగి శ్రీ ధర్మవ్యాధుడు చరిత్ర’. ఉల్కందేకార్‌ మురళీధర్‌ నిర్మిస్తున్నారు. విజయ్‌ భాస్కర్‌, అనుషా, అశోక్‌కుమార్‌, ఆనంద్‌ భారతి, వి.మురళీధర్‌ ప్రధాన పాత్రధారులు. లక్ష్మణసాయి, లక్ష్మీవినాయక్‌, సంజీవ్‌కుమార్‌ మోగేటి స్వరకల్పనలోని ఈ చిత్రంలోని గీతాల్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. మానవ హక్కుల నేత జె.సి.చంద్రయ్య, తెలంగాణ బి.సి కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ధర్మవ్యాధుడి గొప్పతనం గురించి సమాజానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ సినిమా తీశా’’ అన్నారు. వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ‘‘సనాతన భారతీయ సంస్కృతిని సమాజానికి మళ్లీ ఒకసారి గుర్తుచేయాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశారు. విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, నిర్మాతలు రామసత్యనారాయణ, సాయివెంకట్‌, ఉపేంద్రతోపాటు, నటులు అశోక్‌కుమార్‌, పాటల రచయిత కావూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని