నిహారిక ప్లేస్‌ను రీప్లేస్‌ చేసిన మేఘా ఆకాశ్‌

త్వరలో ప్రారంభం కానున్న ఓ సినిమాలో నిహారిక కొణిదెల ప్లేస్‌ను నటి మేఘా ఆకాశ్‌ రీప్లేస్‌ చేశారు. అశోక్‌ సెల్వన్‌ హీరోగా స్వాతిని దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకోసం మొదట చిత్రబృందం నిహారికను ఎంపిక చేసుకుంది. వేసవిలో ప్రారంభం...

Published : 10 Sep 2020 16:20 IST


నాకెంతో సంతోషంగా ఉంది: నటి

చెన్నై: త్వరలో ప్రారంభం కానున్న ఓ సినిమాలో నిహారిక కొణిదెల ప్లేస్‌ను నటి మేఘా ఆకాశ్‌ రీప్లేస్‌ చేశారు. అశోక్‌ సెల్వన్‌ హీరోగా స్వాతిని దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకోసం మొదట చిత్రబృందం నిహారికను ఎంపిక చేసుకుంది. వేసవిలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కొవిడ్‌-19 విజృంభణ కారణంగా వాయిదా పడింది. ఇటీవల నిశ్చితార్థంతో వివాహబంధంవైపు అడుగులువేసిన నిహారిక ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఆమె సదరు కోలీవుడ్‌ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు చిత్ర నిర్మాతకు తెలియజేశారు.

కాగా, ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్‌ను ఎంపిక చేసుకున్నట్లు నిర్మాత సెల్వాకుమార్‌ తెలిపారు. ‘ఎంతో టాలెంట్‌ కలిగిన మేఘా ఆకాశ్‌ మా సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. మా ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర ఎంతో విభిన్నంగా కనిపించనుంది. సదరు పాత్రకు మేఘా చక్కగా నప్పుతుందని దర్శకురాలు స్వాతిని చెప్పడంతో ఆలోచించాను. మేఘా ఈ కథకు సరిగ్గా సరిపోతుందనిపించింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అక్టోబర్‌లో షూటింగ్‌ ఆరంభించనున్నాం.’ అని ఆయన వెల్లడించారు.

‘కథానాయిక పాత్రకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చే విభిన్నమైన కథల్లో నటించే అవకాశం రావడం ఓ హీరోయిన్‌కు అదృష్టం అనే చెప్పాలి. అలాంటి అవకాశాలను పొందడం సులువు కాదు. దర్శకురాలు స్వాతిని కథను వినిపించిన వెంటనే ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశాను. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను.’ అని మేఘా ఆకాశ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని