
జాన్వికపూర్‌ని ఫాలో అయిన నిహారిక
రిసెప్షన్‌లో మెరిసిపోయిన కొత్తజంట
హైదరాబాద్: నిహారిక-చైతన్యల వివాహం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఆత్మీయులందరి కోసం తాజాగా కొణిదెల- జొన్నలగడ్డ కుటుంబాలు రిసెప్షన్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వివాహ విందుకు చిరంజీవి కుటుంబంతోపాటు బంధువులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, రిసెప్షన్‌లో నిహారిక.. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్ర రూపొందించిన బ్రైడల్ లెహంగాని ధరించి మెరిసిపోయారు. లైట్ గ్రీన్, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ లెహంగాలో నిహారిక చాలా అందంగా కనిపించారు. అయితే, మనీశ్ మల్హోత్ర బ్రైడల్ కలెక్షన్ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రూపొందించిన ఓ ప్రకటనలో జాన్వికపూర్ ఈ లెహంగానే ధరించి రాకుమార్తెలా ముస్తాబయ్యారు. అప్పట్లో జాన్వికపూర్ ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా రిసెప్షన్ కోసం నిహారిక అదే తరహా లెహంగాలో కనిపించడంతో పలువురు నెటిజన్లు.. ‘వావ్.. మనీశ్ దుస్తుల్లో అప్పుడు జాన్వి.. ఇప్పుడు నిహారిక ఎంతో అందంగా ఉన్నారు.’, ‘కొత్త పెళ్లికూతురు మరెంతో అందంగా ఉన్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం.. జాన్వికపూర్‌ని నిహారిక ఫాలో అయ్యిందంటున్నారు.
ఇవీ చదవండి
నిశ్చయ్.. ఇవి చాలా ఖరీదు గురూ..!