Updated : 21 Dec 2020 23:08 IST

‘అంతిమ్‌ మొదలైంది’ అంటున్న సల్మాన్‌!

ముంబయి: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘అంతిమ్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయుష్‌ శర్మ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అలాగే ‘అంతిమ్ మొదలైంది’ అంటూ వాక్యాన్ని జతచేశారు. ఈ చిత్రంలో సల్మాన్‌ సిక్కు పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. మహేష్‌ మంజ్రేకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఆయుష్‌ శర్మ ఈ చిత్రానికి సంబంధించిన సల్మాన్‌ ఖాన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జీ5లో వచ్చిన మరాఠీ క్రైమ్‌ డ్రామా ముల్షీకి అనుసరణీయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూణెలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. 

 
Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts