Nasser: తమిళ చిత్రపరిశ్రమకు పవన్‌ విజ్ఞప్తి.. ఆ వార్తలు నిజం కాదు: నాజర్‌

తమిళ చిత్ర పరిశ్రమను ఉద్దేశిస్తూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట చక్కర్లు కొడుతోన్న వార్తలపై తాజాగా నటుడు నాజర్‌ (Nasser) స్పందించారు. ఆయా కథనాలపై క్లారిటీ ఇచ్చారు.

Updated : 27 Jul 2023 20:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ సినిమాల్లో కేవలం తమిళ నటీనటులనే తీసుకోవాలని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా కొత్త నియమాలు తీసుకుందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ‘బ్రో’ (BRO) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సైతం ఈ విషయంపై మాట్లాడారు. తమిళ చిత్ర పరిశ్రమ అందరికీ అవకాశాలు కల్పించాలని, అన్ని భాషల వాళ్లు కలిస్తేనే అది గొప్ప సినిమా అవుతుందన్నారు.

కాగా, ఈ వ్యవహారంపై తాజాగా కోలీవుడ్‌ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్‌ (Nasser) స్పందించారు. ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా ఇలాంటి రూల్స్‌ ప్రవేశపెట్టలేదని చెప్పారు. కోలీవుడ్‌ను ఉద్దేశించి ప్రస్తుతం చక్కర్లు కొడుతోన్న వార్తల్లో ఎలాంటి నిజంలేదన్నారు. ‘‘ఇతర భాషలకు చెందిన నటీనటులను ప్రోత్సహించకూడదంటూ FEFSI కొత్త నియమాలు తీసుకువచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి నియమాలు వస్తే.. వ్యతిరేకించే వారిలో ముందు నేనుంటా. ఇప్పుడు అంతటా పాన్‌ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్‌ కలిస్తేనే మంచి సినిమాలు రూపొందించవచ్చు.

ప్రభాస్‌పై నాకు గౌరవం ఉంది: రీసెంట్‌ క్లాష్‌పై వివేక్‌ ట్వీట్‌

తమిళ సినీ కార్మికులను సంరక్షించడం కోసం FEFSI కొన్ని రూల్స్‌ తీసుకువచ్చింది. అంతేకానీ, ఇతర భాషలకు చెందిన నటీనటుల గురించి కాదు. పవన్‌కల్యాణ్‌పై నాకు గౌరవం ఉంది. అందరూ కలిస్తే గొప్ప చిత్రాలు వస్తాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నేనూ అంగీకరిస్తా. FEFSI కొత్త రూల్స్‌పై ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం అందించినట్టు ఉన్నారు’’ అని నాజర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని