Akhil Akkineni: నాకు లవ్‌ అంటే అదే.. పెళ్లి రూమర్స్‌పై అఖిల్‌ క్లారిటీ

ప్రస్తుతానికి తాను సింగిల్‌ అని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడంలేదని స్పష్టతనిచ్చారు హీరో అఖిల్‌ అక్కినేని. క్రీడలంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు.

Published : 19 Mar 2023 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై యువ హీరో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) స్పందించారు. ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. అవన్నీ రూమర్స్‌ అని, తాను ఇప్పుడు పెళ్లి చేసుకోవడంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సింగిల్‌ అని చెప్పారు. ‘మీ ఉద్దేశంలో లవ్‌ అంటే ఏంటి?’ అనే ప్రశ్న ఎదురవగా ‘స్పోర్ట్స్‌’ అని అఖిల్‌ సమాధానమిచ్చారు. తనకు చిన్నప్పటి నుంచీ ఆటలంటే ఇష్టమన్నారు. బాల్యంలో తానెప్పుడు క్రికెట్‌ ఆడినా టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేవాడినని తెలిపారు. తాను సిక్సర్‌ కొట్టినప్పుడల్లా ఎన్నో కిటికీ అద్దాలు పగిలిపోయేవని గుర్తుచేసుకున్నారు. క్రీడలతో మానసికంగానూ దృఢంగా తయారవుతామన్న అఖిల్‌.. ప్రతి ఒక్కరూ తప్పక ఆటలు ఆడాలని విజ్ఞప్తి చేశారు.

సోషల్‌ మీడియా గురించి చెబుతూ.. ‘దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. అదంటే కొంచెం భయం. సినిమాల అప్‌డేట్లు షేర్‌ చేస్తుంటానంతే’ అని పేర్కొన్నారు. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో 2021లో మంచి విజయాన్ని అందుకున్న అఖిల్‌ ప్రస్తుతం ‘ఏజెంట్‌’ (Agent) సినిమాతో బిజీగా ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ప్రస్తుతం జరుగుతోన్న ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌’ (CCL)లో టాలీవుడ్‌ టీమ్‌ ‘తెలుగు వారియర్స్‌’కు అఖిల్‌ కెప్టెన్‌గా రాణిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు