Alia bhatt: ఆ అబద్ధపు ప్రచారాలు నన్ను బాధపెట్టవు

సినీ తారలు తమ నటనతో ప్రశంసలు అందుకోవడమే కాకుండా... వారి వ్యక్తిగత జీవితంలో విమర్శలను ఎదుర్కోవడం సహజం.

Updated : 18 Nov 2023 09:23 IST

సినీ తారలు తమ నటనతో ప్రశంసలు అందుకోవడమే కాకుండా... వారి వ్యక్తిగత జీవితంలో విమర్శలను ఎదుర్కోవడం సహజం. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే కథానాయిక అలియా భట్‌.. వ్యక్తిగత విషయాల్లో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపింది. ఇటీవల ఓ టాక్‌ షోలో తన భర్త తనను వేధిస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై, తనపై వస్తున్న రూమర్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది అలియా. ‘ఇది ఇంటర్‌నెట్‌ యుగం. నేను కొవ్వు తగ్గించుకొని సన్నగా మారడానికి, చర్మం తెల్లగా మారడానికి సర్జరీ చేయించుకున్నానంటూ వార్తలు వచ్చాయి. దీంతో పాటు నా వివాహ జీవితంలో సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ అపోహలు మాత్రమే. ఇలాంటివి నేను పట్టించుకోను. అవేవీ నన్ను బాధపెట్టవు’ అంటూ చెప్పింది అలియా. రణ్‌బీర్‌ తనను వేధిస్తున్నాడంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారంటూ తెలిపింది అలియా. ‘నేను గతంలో ఓ ఇంటర్య్వూలో నా భర్తకు లిప్‌స్టిక్‌ నచ్చదని, వెంటనే తీసివేయమన్నాడని చెప్పాను. అప్పటి నుంచి రణ్‌బీర్‌పై టాక్సిక్‌ మేన్‌ అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయనకు నేను సహజంగా ఉండటం ఇష్టం. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రపంచంలో మీరందరూ ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయాల గురించి ప్రచారం చేస్తుంటే బాధగా ఉంద’ని చెప్పుకొచ్చింది అలియా. ప్రస్తుతం ‘జిగ్రా’ చిత్రీకరణలో ఉందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని