Aliabhatt: మాకూ చీకటి రోజులున్నాయి

పేరు, గుర్తింపు, విలాసాలే కాదు.. సెలెబ్రిటీల జీవితాల్లో ఎత్తుపల్లాలు, ఒక్కోసారి పూట గడవని గడ్డు రోజులూ ఉంటాయంటోంది అలియా భట్‌.

Updated : 02 Oct 2023 13:11 IST

పేరు, గుర్తింపు, విలాసాలే కాదు.. సెలెబ్రిటీల జీవితాల్లో ఎత్తుపల్లాలు, ఒక్కోసారి పూట గడవని గడ్డు రోజులూ ఉంటాయంటోంది అలియా భట్‌. ‘రాజీ’, ‘గంగూభాయ్‌ కథియావాడీ’, ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’లాంటి హిట్‌లతో అగ్రతారగా ఎదిగిన అలియా ఆదివారం ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత రోజుల్ని తలచుకుంది. ‘మీ నాన్న పెద్ద దర్శకుడు. మీది విలాసాల జీవితం. మీలాంటి వాళ్లు సినిమాల్లోకి రావడం తేలిక.. ఇలాంటి మాటలు నాతో చాలామంది అనేవాళ్లు. కానీ ఎంత పెద్ద దర్శకుడైనా.. మా నాన్న జీవితంలో చీకటి రోజులున్నాయి. ‘అర్థ్‌’, ‘సారాంశ్‌’లాంటి గొప్ప హిట్లు ఇచ్చిన తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాపులొచ్చాయి. చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఆ సమయంలో నాన్న తాగుడుకి అలవాటు పడ్డారు. ఇంట్లో ఇబ్బందిగా ఉండేది. అమ్మ సోనీ రజ్దాన్‌ సినిమాల్లో నటించాలనుకుంది. కానీ ఆమెకి హిందీ పెద్దగా రాదు. అయినా ఫిల్మ్‌, టెలివిజన్‌ స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగేది. అవకాశాలివ్వమని ప్రాథేయపడేది. ఏవో చిన్నాచితకా పాత్రలు తప్ప మంచి ప్రాధాన్యం ఉన్న వేషాలు దొరికేవి కావు. అయినా ప్రయత్నాలు ఆపకపోయేది. ఆ  కష్ట సమయంలోనూ అమ్మ నాతో క్రమశిక్షణ, ఓపిక ఉంటేనే ఎదుగుతాం అని చెప్పేది’ అంటూ ఆనాటి రోజుల్ని తలచుకొని బాధ పడింది. అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ అనే సినిమాలో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు