Allu Arjun: ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నా: అల్లు అర్జున్‌ పోస్ట్‌

ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానంటూ హీరో అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 01 Jan 2024 02:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: 2023లో తాను ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నానని ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) తెలిపారు. మరికొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. అభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతూ.. 2023 అందించిన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ‘‘పలు విధాలుగా 2023 నాకెంతో ప్రత్యేకం. ఈ ఏడాదిలో నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. కృతజ్ఞతతో ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, సినీ నటుడు నాని 2023కి గుడ్‌బై చెబుతూ తన సినిమాలను గుర్తుచేసుకున్నారు. ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాలతో ఆయన ప్రేక్షకులను అలరించారు.

అలా చేసి ఉంటే.. ‘సలార్‌’కు ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవి: ‘బాహుబలి’ నిర్మాత

2023లోనే అల్లు అర్జున్‌ను జాతీయ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ (Pushpa: The Rise)లోని నటనగాను ఆయనకు నేషనల్‌ అవార్డు దక్కింది. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రస్తుతం.. ‘పుష్ప 2’ (Pushpa: The Rule)తో బిజీగా ఉన్నారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప2’ను రూపొందిస్తున్నారు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్‌ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే హైలైట్‌గా ఉంటుందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. అర్జున్‌ పెర్ఫామెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఈ సినిమా నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని, ముఖ్యంగా ఇంటర్వెల్‌ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుందని ఓ సందర్భంలో అన్నారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు