Baby: నవ్విస్తుంది.. షాకిస్తుంది

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబి’. ఎస్‌కేఎన్‌ నిర్మాత.

Updated : 08 Jul 2023 14:05 IST

నంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్‌ తెరకెక్కించిన చిత్రం ‘బేబి’ (Baby). ఎస్‌కేఎన్‌ నిర్మాత. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దర్శకులు వంశీ పైడిపల్లి, మారుతి హైదరాబాద్‌లో శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘‘ఆనంద్‌ ఇప్పటి వరకు చేసిన చిత్రాలు ఒకెత్తు.. ఈ ‘బేబి’ మరొకెత్తు. ఈ కథను సాయి రాజేష్‌ ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూశా. ఇంత అద్భుతమైన చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదనిపించింది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మారుతి. హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో గుర్తుండిపోయే సంభాషణలు, భావోద్వేగాలు, పాటలు.. అన్నీ ఉన్నాయి. నేనే కాదు.. ప్రతి టెక్నీషియన్‌ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. నాలోని నటుడ్ని గుర్తించింది నిర్మాత ఎస్‌కేఎన్‌. సాయి రాజేష్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ నవ్విస్తుంది. షాక్‌కు గురి చేస్తుంది.. సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ప్రతి ఒక్కరి మదిలో పదిలంగా గుర్తుండిపోతుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌లో చూసింది కొంచెమే. సినిమాలో చాలా ఇంటెన్స్‌ సీన్లు ఉన్నాయి. ఇందులోని ప్రతి పాత్రతోనూ బలంగా కనెక్ట్‌ అవుతారు. ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంద’’న్నారు మరో హీరో విరాజ్‌. నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చాలా ఎమోషన్‌ ఉంది. ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఈతరం కుర్రాళ్ల కోసం తీసిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మేము ఓ మంచి సినిమా తీశామని గర్వంగా ఉంద’’న్నారు దర్శకుడు సాయి రాజేష్‌. ఈ కార్యక్రమంలో వైష్ణవి, బన్నీ వాసు, బాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని