సుమంత్‌ వద్దంటే తరుణ్‌ కావాలన్నాడు!

తరుణ్, మధు బాల్య స్నేహితులు. అది కాస్తా ప్రేమకు దారితీస్తుంది. మధుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిస్తే ఎక్కడవాళ్ల స్నేహం ముక్కలవుతుందోనని చెప్పకుండా దాస్తాడు.

Published : 20 Jan 2024 13:49 IST

హైదరాబాద్‌: తరుణ్, మధు బాల్య స్నేహితులు. అది కాస్తా ప్రేమకు దారితీస్తుంది. మధుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిస్తే ఎక్కడవాళ్ల స్నేహం ముక్కలవుతుందోనని చెప్పకుండా దాస్తాడు. ఈ విషయం తెలియని మధు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లి సమయానికి తరుణ్‌ తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడని మధుకి అర్థమవుతుంది. చివరికి వారిద్దరు కలుసుకుంటారు.. అలా కథ సుఖాంతం అవుతుంది. ఇప్పటికే ఇది ‘నువ్వే కావాలి’ (nuvve kavali movie) చిత్రం అని మీకు తెలుసుంటుంది. తరుణ్, రిచా పల్లోడ్‌ను నటీనటులుగా దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ ప్రేమకథ అప్పట్లో సంచలనం సృష్టించింది. త్రివిక్రమ్‌ మాటలు, కోటి పాటలు ఇప్పటికీ ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటాయి. అప్పటివరకూ బాలనటుడిగా ప్రేక్షకుల్ని అలరించిన తరుణ్‌ ఈ చిత్రంతో కథానాయకుడిగా మారి ఆశ్చర్యపరిచాడు. ఇందులోని తన నటనతో మరోమెట్టు ఎక్కాడు. అయితే ఈ అవకాశం ముందుగా హీరో సుమంత్‌కి వచ్చిందట. ఆయన మరో సినిమాతో బిజీగా ఉండటంతో ఈ చిత్రంలో నటించలేకపోయారు. అలా ‘నువ్వే కావాలి’ చిత్రాన్ని తరుణ్‌ అందుకుని సూపర్‌హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని