Bigg Boss 5: సిరిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? హౌస్‌మేట్స్‌కు ప్రేక్షకుల ప్రశ్నలు.. ఏం సమాధానాలు చెప్పారంటే..?
సినిమా స్టార్స్ అనుకరణ టాస్క్‌లో ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో శ్రీదేవిగా చేసిన కాజల్‌కు ఓటు అడిగే అవకాశం లభించింది
హైదరాబాద్: సినిమా స్టార్స్ అనుకరణ టాస్క్‌లో ఇంటి సభ్యుల ఏకాభిప్రాయంతో శ్రీదేవిగా చేసిన కాజల్‌కు ఓటు అడిగే అవకాశం లభించింది. దీంతో ఆమె ఎమోషనల్ అయింది. ‘నా పెర్ఫామెన్స్ నచ్చి, ఇంత దూరం తీసుకొచ్చారు. మొదటి రోజు నుంచి అందరూ చూస్తున్నారు. నేను కొంచెం నచ్చినా ఓటు వేయండి. బిగ్‌బాస్‌కు రావడం నా డ్రీమ్. అది నెరవేరింది. నా ఫ్రెండ్స్‌తో కలిసి టాప్-5లో ఉండాలనుకుంటున్నా’’ అని కాజల్ ఓటు అప్పీల్ చేసింది. ఆ తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఇంటి సభ్యులు సమాధానం చెప్పాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించాడు. నిజాయతీగా సమాధానం చెప్పిన వ్యక్తికి ఓటు అడిగే అవకాశం లభిస్తుందని అన్నాడు. ఆ తర్వాత ఒక్కో ప్రశ్నను టెలివిజన్ స్క్రీన్‌పై డిస్ప్లే చేయడంతో హౌస్మేట్స్ వాటికి సమాధానం ఇచ్చారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి సగటు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఆ ప్రశ్నలన్నీ అందులో ఉన్నాయి. అవే ఈ ప్రశ్నలు..
మీరు షణ్ముఖ్ కన్నా బలమైన ప్లేయర్. కానీ, మిమ్మల్ని మీరు ఎందుకలా గుర్తించుకోవటం లేదు?
సిరి: నేను బలమైన ప్లేయర్‌నని ఒప్పుకుంటా. కానీ, నేను హౌస్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నా. ఆ సమయంలో షణ్ముఖ్ నాకు అండగా నిలిచాడు. ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తా. షణ్ముఖ్‌తో నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. నాకన్నా పైస్థానంలో షణ్ముఖ్‌ను చూడాలనుకుంటున్నా.
అనీ మాస్టర్‌తో మర్యాద గురించి మాట్లాడిన మీరు, తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం మర్యాద అనిపించుకుంటుందా?
కాజల్: టాస్క్‌లో భాగంగా అనుకోని కారణాల వల్ల అనీ మాస్టర్‌తో వివాదం జరిగింది. సన్నీతో ఉన్న చనువుతోనే అలా చేశా. సన్నీ అంటే నాకు చాలా మర్యాద. అయితే, కాస్త చనువు ఎక్కువ.
గిల్టీ బోర్డు వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ సంఘటన తర్వాత మీ కాన్ఫిడెన్స్ ఎలా తిరిగి పొందారు?
సన్నీ: గిల్టీ బోర్డు వేసుకున్నప్పుడు చాలా బాధపడ్డా. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌస్మేట్స్ నుంచి వచ్చిన అభిప్రాయాన్ని నేను తప్పుపట్టను. ఆ సమయంలో నేను కోపంతో ఉన్నా. కొన్ని మాటలు విన్న తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. జనాల నుంచి వచ్చిన ధైర్యం, వీకెండ్స్‌లో నాకు వచ్చిన అభినందనలు నాలో కాన్ఫిడెన్స్ నింపాయి. అదే నన్ను ముందుకు నడుపుతోంది. నన్ను నేను అద్దంలో చూసుకుని ‘కమాన్ సన్నీ’ అనుకుంటున్నా.
జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ముఖ్ పరిపక్వత లేని వ్యక్తి అని చెప్పారు. కానీ, ర్యాంకింగ్స్ టాస్క్‌లో షణ్ముఖ్ పరిపూర్ణ వ్యక్తి అని అతనిని 2వ స్థానంలో నిలబెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ముఖ్ గ్రూప్‌లో ఉన్నారా?
శ్రీరామ్: నేను ఏ గ్రూప్‌లోనూ లేను. జెస్సీతో గొడవ జరిగినప్పుడు షణ్ముఖ్‌తో పెద్దగా పరిచయం లేదు. అప్పుడు నేను రెండు వైపులా స్టోరీ తెలుసుకుని స్పందించి ఉంటే బాగుండేది. ఆ సమయంలో తను ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసిన షణ్ముఖ్ వేరు. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ మొదలైంది. అందుకే పరిపూర్ణత వచ్చిన వ్యక్తిగా కనిపించడంతో 2వ స్థానంలో పెట్టా.
ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించటం లేదా?
మానస్: ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడన్నది సరైన ఆలోచన కాదు. ఈ జర్నీలో మా మధ్య అనుబంధం పెరుగుతూ వెళ్లింది. ఆ ఆలోచన రాలేదు. నిజాయతీగా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత విలువ ఇస్తాడో, వాళ్లను సేవ్ చేసినప్పుడు సన్నీ రియాక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒకరిని వాడుకుని పైకి రావాలన్న మనస్తత్వం సన్నీకి ఎప్పుడూ లేదు. నాకూ లేదు. నాకెప్పుడూ అలా అనిపించదు. ఒకవేళ మీకు అనిపిస్తే ఆ ఆలోచన మార్చుకోండి.
సిరి అంటే మీరెందుకు సొంత వ్యక్తిలా ఫీలవుతారు. మీరు సిరిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? ఆమెను తనలా ఎందుకు ఉండనివ్వరు?
షణ్ముఖ్: ఈ ప్రశ్న వస్తుందని నేను అనుకున్నా. నా సొంత వ్యక్తిలా భావిస్తున్నానని నాకూ తెలుసు. కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తే బాగుంటుందని, ఇంకొన్ని విషయాల్లో తనని వదిలేస్తే బాగుంటుందని అనుకున్నా. ఇక్కడే కాస్త తికమకపడ్డా. ఆ క్రమంలో ఆమెపై కొన్నిసార్లు అరిచాను. నాకన్నా తనే నన్ను అర్థం చేసుకుంది. పూర్తి పరిపక్వత చెందిన వ్యక్తి. గేమ్‌లో ఆమెను ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు. బయట ఎవరైతే ఆమె మీద గేమ్ ఆడాలనుకుంటున్నారో ఆ సమయంలో కంట్రోల్ చేస్తాను. ఆమెను టాప్-5లో చూడాలనుకుంటున్నా!
అందరి ముందు కాజల్‌ను ఎందుకు అగౌరవపరుస్తారు/ఆటపట్టిస్తారు? మీకోసం నిలబడి ఎవిక్షన్ ఫ్రీపాస్ గెలిచింది కదా!
సన్నీ: సరదాగా ఆటపట్టించాను. నేనెప్పుడూ ఆమెను ఒక స్నేహితురాలిగా చూస్తా. ఆమె ఎప్పుడైనా బాధపడుతుందని అనిపిస్తే, దాన్ని అక్కడితో ఆపేసేవాళ్లం. మీరు అలా అన్నారు కాబట్టి, ఆమెను ఇంకొంచెం ఎక్కువ ఏడిపిస్తా(నవ్వులు)
మీరు రవిని నామినేట్ చేశారు. ఇంకా ఆయనికి ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అనే పేరు కూడా ఇచ్చారు. మరి టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ‘రవి నీకోసం ఆడుతున్నాం. మిస్ యు రవి’ అని అనడం కరెక్టేనని మీరు అనుకుంటున్నారా?
సిరి: మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు కదా! రవి ఉన్నప్పుడు చెల్లిలా చూసేవాడు. ఆ వీక్ రవి వెళ్లిపోతాడని అనుకోలేదు. అతను ఎలిమినేట్ అయ్యే సరికి బాధగా అనిపించింది. ఆ గేమ్ ఆడుతున్నప్పుడు రవి గుర్తొచ్చాడు. అతని కోసం ఆడాలనిపించింది. వ్యక్తిగతంగా అతనిని మిస్ అయ్యాను. అంతకు మించి ఏమీ లేదు.
ఇవి ఎలా నచ్చుతున్నాయి.. అవి ఎలా నచ్చుతున్నాయి.. అని ఆడియన్స్‌ని ఎందుకు జడ్జి చేస్తున్నారు. వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు?
షణ్ముఖ్: అది నా ఊహ మాత్రమే. 24 గంటల్లో జరిగిన వివిధ సంఘటనలను నేను పరిశీలిస్తా. నాకు నచ్చని పాయింట్లు బయట వాళ్లకు నచ్చుతున్నాయో లేదోనని ఆలోచిస్తా. ఆ ఊహా తప్పా? కరెక్టా?అనేది నాకు తెలియదు. ఆడియన్స్ మీద ఫన్ చేద్దామన్న ఉద్దేశం లేదు. మీరు అలా తీసుకుని ఉంటే క్షమించండి.
మీరు మొదటి నుంచి గ్రూప్‌లోనే ఆడుతూ వచ్చారు. కానీ, మిమ్మల్ని మీరు ఒంటరి వ్యక్తి అని పైకి చెప్పుకుంటున్నారు. సానుభూతి పొందడానికి మీ ప్రణాళికా? ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో మీరు, రవి కూడా ఇద్దరి ఫొటోలు కాల్చేయాలని ప్లాన్ వేశారు. కానీ, కాజల్ అదే పని చేస్తే మీకు ఎందుకు కోపం వచ్చింది?
శ్రీరామ్: నన్ను నేను ఎప్పుడూ ఒంటరి వాడిని అనుకోలేదు. సానుభూతి పొందాలన్న ఆలోచన లేదు. అంత ఘోరంగా ఆలోచించలేదు. అందరితోనూ కలిసి ఆడాలనే చూస్తా. ఫైర్ స్టేషన్ గేమ్‌లో అలా ఆడవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే, నేను ఓవర్‌గా రియాక్ట్ అయ్యనేమోనని అనిపించింది. కాజల్ గెలిచిన విధానం సరిగా అనిపించలేదు. ఫొటోలు కాల్చేద్దామన్న దానిపై రవితో మాట్లాడలేదు. అందరూ నిజాయతీగా ఆడదామనుకుని అలా ఎందుకు చేశారన్న కోపం వచ్చింది.
ప్రియాంక మీ స్నేహితురాలు అనుకున్నప్పుడు మీరు ఆమెను ఎందుకు తక్కువ చేసి చూశారు?
మానస్: కొన్నిసార్లు ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పుడు దాన్ని ఆమెతో పంచుకునేవాడిని. అది మీకు తప్పుగా అనిపిస్తే, అది నా తప్పు. ఒక ఫ్రెండ్ గురించి నచ్చని విషయాలు చెప్పకూడదు. నేనెప్పుడూ ప్రియాంక మంచి కోరే వాడినే. ఆమెను కిందకు లాగాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రియాంకను ఏమైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలి.
మీరు మొదట షణ్ముఖ్‌తో ఫ్రెండ్‌లా ఉండేవారు. ఆ తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్‌తో ఉన్నారు. కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?
కాజల్: మొదట నాకు షణ్ముఖ్ బాగా నచ్చేవాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా దూరంగా జరిగా. రవితో ఎప్పుడూ ఫ్రెండ్‌గా కనెక్ట్ కాలేదు. ఈ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మొదట ఫ్రెండ్‌గా భావించింది మానస్‌నే. ఆ తర్వాత సన్నీ కనెక్ట్ అయ్యాడు. కేవలం ఆట కోసమే వాళ్లతో కనెక్ట్ కాలేదు.
నిజాయితీగా ఎవరు జవాబులు చెప్పారన్న దానిపై ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. సిరి-సన్నీల మధ్య టై అవ్వగా చివరకు ఏకాభిప్రాయంతో ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం సన్నీకి లభించింది. అయితే, ఈ విషయమై శ్రీరామ్-సన్నీల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఒకసారి కాకపోతే మరొకసారైనా తనని గుర్తించటం లేదని సన్నీ వాపోయాడు. మరోవైపు ఎలాంటి చర్చకు తావు ఇవ్వకుండా ఓటు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని సిరి వదిలేసుకోవడంపై శ్రీరామ్ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఓటు అడిగే అవకాశం నాకూ కావాలి’ అని ఎందుకు ఫైట్ చేయలేదని సిరిని ప్రశ్నించాడు. అనవసరంగా సన్నీ దృష్టిలో చెడ్డవాడిని అయ్యానని అన్నాడు. తాను అగ్రెసివ్ కాదని, అందరితో స్నేహంగా ఉంటానని తనని గెలిపించాలని సన్నీ ప్రేక్షకులను కోరాడు. తనతో పాటు తన స్నేహితులకూ ఓటు వేయాలని సన్నీ విజ్ఞప్తి చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు