Bobby Deol: కొన్ని సన్నివేశాల్లో నటిస్తుంటే నాకే ఇబ్బందిగా అనిపించేది..: బాబీ దేవోల్‌

సందీప్‌ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’ (Animal)లో విలన్‌గా ఆకట్టుకున్నారు నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol). తాజాగా ఆయన మాట్లాడుతూ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు ఇబ్బందిగా అనిపించినట్లు చెప్పారు.

Updated : 19 Dec 2023 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా నటించిన ‘యానిమల్‌’ (Animal) మంచి విజయాన్ని సాధించింది. విడుదలై రెండు వారాలు దాటినా ఇంకా భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటూనే ఉంది. బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol) ఇందులో విలన్‌గా తన నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించే సమయంలో ఇబ్బందిపడినట్లు తెలిపారు.

‘‘యానిమల్‌’ షూటింగ్ మొదలయ్యాక కొన్ని సన్నివేశాల్లో నటిస్తుంటే మొదట్లో నాకే ఇబ్బందిగా అనిపించేది. ఎందుకిలా చిరాగ్గా అనిపిస్తుందని నన్ను నేను తర్వాత ప్రశ్నించుకున్నా. నేను కేవలం ఓ పాత్రలో నటిస్తున్నా. సినిమాలో నేను ఎవరితో అయితే దురుసుగా ప్రవర్తిస్తున్నానో.. వాళ్లతో కలిసి షూట్‌ అయ్యాక నేను భోజనం చేస్తాను. అంతా సవ్యంగానే ఉంటుంది. ఇది కేవలం పాత్ర మాత్రమేనని గ్రహించాను. ఇందులో నా పాత్రను నేను విలన్‌గా భావించలేదు. కుటుంబాన్ని అతిగా ప్రేమించే వ్యక్తిగా భావించా. తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే మనవడి పాత్రకు నేను న్యాయం చేయాలని అనుకుని నటించాను’’ అని తెలిపారు.

ఆయన లేకపోతే ‘సలార్‌’ లేదు..: ప్రశాంత్ నీల్‌

ఇక తన కుమారులు ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తిగా ఉన్నట్లు బాబీ దేవోల్‌ చెప్పారు.. ‘మా అబ్బాయిలకు నటన అంటే ఇష్టం. నేను వాళ్లకు కొన్ని సలహాలిచ్చాను. నటనలో రాణించాలంటే ముందు భాషపై పట్టు ఉండాలని చెప్పాను. హిందీ నేర్చుకోమని సలహా ఇచ్చాను. ఇంట్లో కూడా ఆంగ్లంలో కాకుండా హిందీలో మాట్లాడాలని చెప్పా’’ అని తెలిపారు. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్‌’కు త్వరలోనే సీక్వెల్‌ తెరకెక్కనుంది. ‘యానిమల్‌ పార్క్‌’ పేరుతో ఇది రూపొందనుంది. మొదటి భాగంతో పోలిస్తే రెండో దాంట్లో మరిన్ని బలమైన పాత్రలుండనున్నాయి. గతంలో తన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాల కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే ‘యానిమల్‌ పార్క్‌’ లక్ష్యమని తాజాగా సందీప్‌ వంగా (Sandeep Reddy Vanga) తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు