కలర్‌ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా

సుహాస్‌, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫోటో’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు.

Published : 14 Apr 2021 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుహాస్‌, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘కలర్‌ ఫోటో’. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ ప్రేమ కథా చిత్రం గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది. ఇటీవలే ఈ సినిమాలోని ‘కాలేజీ’ పాట ఫుల్‌ వీడియోను యూ ట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. నాయకానాయికల పరిచయం, ర్యాగింగ్‌ నేపథ్యంలో ఈ గీతం సాగుతుంది. సాయి కిరణ్‌ సాహిత్యం అందించిన ఈ పాటని హేమ చంద్ర ఆలపించారు. కాల భైరవ స్వరాలు సమకూర్చారు. ఆలస్యమెందుకు చూసి ఆనందించండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని