Devil: గూఢచారిగా కల్యాణ్‌రామ్‌.. ‘డెవిల్‌’ కాస్ట్యూమ్స్‌ విశేషాలు తెలుసా?

‘డెవిల్‌’ సినిమాలోని హీరో పాత్ర కోసం ఎలాంటి దుస్తులు రూపొందించారో కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేశ్‌ తెలిపారు. సినిమా ఈ నెల 29న విడుదలకానున్న సందర్భంగా పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 10 Dec 2023 21:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా స్వీయ నిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెవిల్‌’ (Devil). సంయుక్త కథానాయిక. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో ఈ సినిమాలో చూపించనున్నారు. కల్యాణ్‌ రామ్‌ గూఢచారిగా కనిపించనున్నారు. ఈ నెల 29న (Devil Release Date) సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రాజేశ్‌ పలు విశేషాలు పంచుకున్నారు. రీసెర్చ్‌ చేసి సంబంధిత దుస్తులు రూపొందించానని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శక-నిర్మాత, హీరోకు కృతజ్ఞతలు చెప్పారు. ‘‘అభిషేక్ నామా ఈ సినిమా స్క్రిప్ట్ వినిపించగానే హీరో లుక్‌ విభిన్నంగా ఉంటుందని అర్థమైంది. ఇందులోని కథానాయకుడు భారతీయుడేగానీ బ్రిటిష్‌ గూఢచారిగా పని చేస్తుంటాడు. ఆ స్పై క్యారెక్టర్‌కు తగ్గట్లు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయాలని ముందు నుంచే అనుకున్నా. ధోతీ విషయంలో భారతీయత ఉట్టిపడేలా జాగ్రత్త తీసుకున్నాం’’ అని తెలిపారు.

కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా రాజేశ్‌కి ఇది 60వ, కల్యాణ్‌రామ్‌తో 6వ చిత్రం. గతంలో కల్యాణ్‌ రామ్‌ నటించిన ‘ఎం.ఎల్‌.ఎ’, ‘118’, ‘ఎంత మంచి వాడ‌వురా’ సినిమాలకు రాజేశ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. మరో మూడు కొత్త చిత్రాలకు ఇద్దరూ కలిసి కలిసి పనిచేయనున్నారు.

సమంత కొత్త ప్రయాణం.. సోషల్‌ మీడియాలో ప్రకటన.. అదేంటంటే?

‘డెవిల్‌’ కాస్ట్యూమ్స్ విశేషాలివీ..

  • హీరో పాత్ర కోసం మొత్తం 90 కాస్ట్యూమ్స్‌ రూపొందించారు
  • ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊలుతో 60 బ్లేజ‌ర్లను తయారు చేశారు
  • 25 ప్రత్యేకమైన వెయిస్ట్ కోటుతోపాటు దేశీయ‌ కాట‌న్‌తో కుర్తా, ధోతీలను తయారు చేశారు
  • బ్లేజ‌ర్ జేబు ప‌క్క‌న వేలాడుతూ ఉండేలా ఓ వాచ్‌ను ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దారు. పురాతన వాచీలను సేకరించే అభిరుచి కలిగిన దిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి ఆ వాచ్‌ను తీసుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని