Samantha: సమంత కొత్త ప్రయాణం.. సోషల్‌ మీడియాలో ప్రకటన.. అదేంటంటే?

నటిగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సమంత కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అదేంటంటే?

Published : 10 Dec 2023 20:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి సమంత (Samantha) వృత్తిపరంగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తాను నిర్మాణ సంస్థను నెలకొల్పినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ ప్రొడక్షన్‌ హౌస్‌కు ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’ (Tralala Moving Pictures) పేరు పెట్టినట్లు తెలిపారు. తనకు బాగా ఇష్టమైన సాంగ్‌ ‘బ్రౌన్‌ గర్ల్‌ ఈజ్‌ ఇన్‌ ది రింగ్‌ నౌ’ (హాలీవుడ్‌) లిరిక్స్‌ స్ఫూర్తితో ట్రాలాలా అని పేరు పెట్టానని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు (Samantha Production House). వాస్తవానికి దగ్గరగా ఉండే, అర్థవంతమైన, యూనివర్సల్‌ స్టోరీలు చెప్పగలిగే దర్శకులకు ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ వేదికగా నిలుస్తుందన్నారు (Samantha as Producer). 

నగ్న ఫొటోలు షేర్‌ చేసిన హీరో.. ప్రతి సంవత్సరం ఇలా 10రోజులంటూ పోస్ట్‌

ఈ ప్రకటనపై పలువురు సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కామెడీ, ఎమోషన్స్‌ను నేను బాగా డీల్‌ చేయగలను. యాక్షన్‌ కోసం ప్రయత్నిస్తున్నా. ప్లీజ్‌ మేడమ్‌.. నాకో అప్లికేషన్‌ ఇవ్వండి’’ అంటూ దర్శకురాలు నందిని రెడ్డి సరదాగా కామెంట్‌ పెట్టారు. ‘కంగ్రాట్స్‌.. మీ సినిమాల్లో యంగ్‌ హీరో అవసరం ఉంటే నాకు కాల్‌ చేయండి’ అని నటుడు తేజ సజ్జ విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ప్రత్యూష ఫౌండేషన్ చిన్నారులతో కలిసి సమంత హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ‘హాయ్‌ నాన్న’ చిత్రాన్ని చూశారు. సంబంధిత దృశ్యాలు బయటకు రావడంతో నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల.. ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్త విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ‘సిటాడెల్‌’ (Citadel) వెబ్‌సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని