TNR కుటుంబానికి మారుతి సాయం

నటీనటులకు కానీ వారి కుటుంబసభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సినీ పరిశ్రమ మొత్తం ఒకే తాటి మీదకు వచ్చి తమకు చేతనైనంత సాయం చేస్తుంది......

Updated : 13 May 2021 14:13 IST

హైదరాబాద్‌: నటీనటులు, వారి కుటుంబసభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సినీ పరిశ్రమ మొత్తం ఏకతాటి మీదకు వచ్చి తమకు చేతనైనంత సాయం చేస్తుంది. తాజాగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, వ్యాఖ్యాత, నటుడు టీఎన్‌ఆర్‌ ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. టీఎన్‌ఆర్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు.. ఆయన కుటుంబానికి ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా దర్శకుడు మారుతి రూ.50 వేలను తక్షణ ఆర్థికసాయంగా టీఎన్‌ఆర్‌ కుటుంబసభ్యులకు అందించారు. ‘టీఎన్‌ఆర్‌ మేము నిన్ను ఎంతో మిస్‌ అవుతున్నాం. కానీ, మీ కుటుంబానికి అండగా ఉంటాం. మీరు కూడా ఆ కుటుంబానికి సాయం అందించండి’ అని మారుతి ట్వీట్‌ చేశారు. మరోవైపు చిరంజీవి, సంపూర్ణేష్‌బాబు సైతం తమవంతు సాయంగా కొంత మొత్తాన్ని టీఎన్‌ఆర్‌ కుటుంబానికి అందించిన విషయం విదితమే. అంతేకాకుండా ఇప్పటికే చిరంజీవి టీఎన్‌ఆర్‌ సతీమణిని ఫోన్‌లో పరామర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని