FIR: రవితేజతో ద్విభాషా చిత్రం
‘‘థియేటర్ యాజమాన్యాలు... పంపిణీదారులు మా సినిమా విషయంలో ఆనందంగా ఉన్నామని చెప్పడం మా రెండున్నరేళ్ల కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నాం’’ అన్నారు విష్ణు విశాల్.
‘‘థియేటర్ యాజమాన్యాలు... పంపిణీదారులు మా సినిమా విషయంలో ఆనందంగా ఉన్నామని చెప్పడం మా రెండున్నరేళ్ల కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నాం’’ అన్నారు విష్ణు విశాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఇటీవలే తెలుగులో విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది. విష్ణు విశాల్ మాట్లాడుతూ ‘‘తమిళంలో మంచి ప్రారంభ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది సినిమా. తెలుగులోనూ ఆదరణ పొందుతుండడం ఆనందంగా ఉంది. విడుదలకి సహకారం అందించిన రవితేజ, వాసుకీ ధన్యవాదాలు. ఈ సినిమా పోస్టర్‌పై వివాదం తలెత్తింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ విషయంలో ముస్లిం సోదరులకి క్షమాపణలు చెబుతున్నా. ఈ సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు. చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అలాగే రవితేజ నిర్మాణ సంస్థ ఆర్.టి.టీమ్ వర్క్స్‌తో కలిసి మేం త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాని నిర్మిస్తాం. ఆ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమానే తెలుగులోనూ విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచి సినిమా ఏ భాష నుంచి వచ్చినా తెలుగువాళ్లు ఆదరించడానికి ముందుంటారు. పోటీగా సినిమాలు ఉన్నా ‘ఎఫ్.ఐ.ఆర్’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’’ అన్నారు అభిషేక్ పిక్చర్స్ సీఈఓ వాసు. ఈ కార్యక్రమంలో కథానాయిక రెబ్బా మోనిక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్‌లో సెట్లోకి
గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్