Nani: నా వల్లే ప్రాబ్లమ్‌ అయితే ఎల్లిపోతా మావ ఇడికెంచి!

నాని, రాహుల్‌ రామకృష్ణల మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది!

Published : 06 Sep 2021 20:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలో క్లిక్‌ అయిన డైలాగ్స్‌ సందర్భానుసారం నిజ జీవితంలో వాడితే ఆ కిక్కే వేరు. నటులు నాని, రాహుల్‌ రామకృష్ణల మధ్య సరిగ్గా ఇదే జరిగింది. విషయమేటంటే.. ఆ ఇద్దరి నటుల చిత్రాలూ ఓటీటీ వేదికగా వినాయకచవితి (సెప్టెంబర్‌10న) రోజు ప్రేక్షకుల ముందకు రానున్నాయి. అందులో ఒకటి నటుడు నాని నటించిన ‘టక్‌ జగదీష్‌’ కాగా మరొకటి హాస్యనటుడు రాహుల్‌ రామకృష్ణ నటించిన ‘నెట్‌’. ఇక రాహుల్‌.. నానిని ఉద్దేశిస్తూ ‘నానికి పెద్ద ఫ్యాన్‌ ఇక్కడ. అయినా సరే.. నేను నటించిన ‘నెట్‌’ చిత్రమే బాగుంటుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక దీనికి అదిరిపోయే రిప్లై ఇచ్చారు నాని. ‘జాతిరత్నాలు’ చిత్రంలో రాహుల్‌రామకృష్ణ ఫేమస్‌ డైలాగ్ ‘‘నా వల్లే ప్రాబ్లమ్‌ అయితే ఎల్లిపోతా మావ ఇడికెంచి’’ అంటూ సరదగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి సరదా సంభాషణ నెట్టింట నవ్వులు పంచుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని