Sai Pallavi: సాయి పల్లవి బర్త్‌డే సర్‌ప్రైజ్‌లు చూశారా..!

రానా దగ్గుబాటి సరసన సాయి పల్లవి నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. రానా కామ్రెడ్‌గా నటిస్తున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తు్న్నారు.

Published : 09 May 2022 15:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా దగ్గుబాటి సరసన సాయి పల్లవి నటిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం’. రానా కామ్రెడ్‌గా కనిపించనున్న ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రబృందం ‘సోల్‌ ఆఫ్‌ వెన్నెల’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది. ‘చరిత్రలో నిలిచిపోయే ప్రేమ తనది’ అంటూ రానా ట్విటర్‌లో దానిని షేర్ చేశారు. అందులో ‘నిర్బంధాలు కౌగిలించుకున్న వసంత కాలం మనది..’ అంటూ సాయి పల్లవి చెప్పిన డైలాగ్‌ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని సురేశ్‌ ప్రొడక్షన్‌, ఎస్‌ఎల్‌వీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తన తదుపరి చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ‘గార్గి’ పేరుతో రాబోతున్న ఈ సినిమా గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అలరించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని