సామాన్యుడే కానీ...

విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌...’  అనేది ఉపశీర్షిక. డింపుల్‌ హయతి కథానాయిక. తు.పా.శరవణన్‌

Updated : 30 Aug 2021 07:21 IST

విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌...’  అనేది ఉపశీర్షిక. డింపుల్‌ హయతి కథానాయిక. తు.పా.శరవణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆదివారం ఈ సినిమా లుక్‌ని విడుదల చేశారు. ‘‘విశాల్‌ నటిస్తున్న 31వ చిత్రమిది. ఆయన సామాన్యుడిగా కనిపిస్తూ... అసామాన్యమైన పనుల్ని ఎలా చేశాడనేది తెరపైనే చూడాలి. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం చిత్రానికి ప్రధాన బలం. త్వరలోనే థియేటర్లలో విడుదలకి సినిమాని సిద్ధమవుతోంద’’ని చిత్రవర్గాలు తెలిపాయి. యోగిబాబు, బాబురాజ్‌ జాకబ్‌, పి.ఎ.తులసి, రవీనా రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కెవిన్‌రాజ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని