
Salmankhan: చిరు.. వెంకీలతో కలిసి నటిస్తున్నా
- సల్మాన్
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘అంతిమ్’. ది ఫైనల్ ట్రూత్.. అన్నది ఉపశీర్షిక. ఆయుష్ శర్మ కథానాయకుడు. మహేష్ మంజ్రేకర్ తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేద్దామనుకున్నాం. కొవిడ్ పరిస్థితుల వల్ల కుదర్లేదు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల నుంచి సినిమాకు దక్కుతున్న ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. అందుకే తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. ఆయుష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా తర్వాతి చిత్రాలన్నీ కచ్చితంగా అన్ని భాషల్లో విడుదల చేస్తా. ప్రస్తుతం హిందీలో ‘భాయీజాన్’, ‘దబాంగ్ 4’, ‘టైగర్ 3’ చిత్రాలు చేస్తున్నా. తెలుగులో చిరంజీవి‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నా. నా పాత్రేంటి అని నేనడగలేదు. నా సినిమాలో చేయాలని చిరు అడిగారు.. ఎన్ని రోజులు కాల్షీట్లు కావాలన్నా.. అంతే. త్వరలో వెంకటేష్‌తోనూ కలసి నటించబోతున్నా. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాన’’న్నారు. ‘‘సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించాలన్న కల ప్రతీ నటుడు, నటికీ ఉంటుంది. నా కల ఈ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో ఆయుష్. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘సల్మాన్ ఖాన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే కథ తయారు చేశాం. ఇప్పుడు వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంద’’న్నారు.
- న్యూస్‌టుడే,కేపీహెచ్‌పీ కాలనీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.