మనాలిలో ‘ఏజెంట్‌’

ఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. రామబ్రహ్మం సుంకర నిర్మాత. మమ్ముట్టి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మనాలిలో 

Published : 26 May 2022 02:07 IST

ఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. రామబ్రహ్మం సుంకర నిర్మాత. మమ్ముట్టి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మనాలిలో జరుగుతున్నట్టు తెలిపింది చిత్రబృందం. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ‘‘స్టైలిష్‌గా రూపొందుతున్న యాక్షన్‌ చిత్రమిది. ఇందులోని పాత్ర కోసం కథానాయకుడు అఖిల్‌ తనని తాను కొత్తగా తీర్చిదిద్దుకున్నారు. ఆయనతోపాటు, కీలక నటులు మనాలిలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆగస్టు 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. వక్కంతం వంశీ సమకూర్చిన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, కూర్పు: నవీన్‌ నూలి, కళ: అవినాష్‌ కొల్లా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని