Cinema news: దుల్కర్‌కు జోడీగా సామ్‌

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. ‘యశోద’, ‘ఖుషి’ చిత్రాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి.

Updated : 06 Aug 2022 02:24 IST

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. ‘యశోద’, ‘ఖుషి’ చిత్రాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. మరోవైపు హిందీలో తెరంగేట్రం చేసేందుకు కొన్ని కథలు ఓకే చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పుడామె ఖాతాలో ఓ మలయాళ చిత్రం చేరినట్లు తెలుస్తోంది. అదే ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. అభిలాష్‌ జోషి తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కథాశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో దుల్కర్‌కు జోడీగా సామ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌, సమంత గతంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ‘మహానటి’ చిత్రంలో నటించారు. కానీ, అందులో ఇద్దరికీ కాంబినేషన్‌ సీన్లు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని