Venkatesh: ఆ పాత్రలో వెంకీ

తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మాతృకను తెర కెక్కించిన అశ్వత్‌ మరిముత్తు ఈ తెలుగు 

Published : 09 Aug 2022 03:44 IST

మిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. మాతృకను తెర కెక్కించిన అశ్వత్‌ మరిముత్తు ఈ తెలుగు సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దేవుడి పాత్ర చాలా కీలకం. మాతృకలో ఈ పాత్రను విజయ్‌ సేతుపతి పోషించారు. ఇప్పుడీ పాత్రను తెలుగులో కథానాయకుడు వెంకటేష్‌ చేయనున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. ఈ అతిథి పాత్ర కోసం వెంకీ మూడు రోజుల కాల్షీట్లు కేటాయించారని సమాచారం. ఇప్పటికే వెంకటేష్‌ పార్ట్‌ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో వెంకీ పాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని పూర్తి చేసి.. సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో విష్వక్‌కు జోడీగా మిథాలీ పార్కర్‌ నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని