Allu Arjun: పుట్టినరోజున పండగే

పండగలైనా...హీరోల పుట్టినరోజులు వస్తున్నా ఆ రోజుపై అభిమానులకి ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. అభిమాన హీరో సినిమాల సందడినే అసలు సిసలు పండగలా భావిస్తుంటారు.

Updated : 24 Mar 2023 07:13 IST

పండగలైనా...హీరోల పుట్టినరోజులు వస్తున్నా ఆ రోజుపై అభిమానులకి ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. అభిమాన హీరో సినిమాల సందడినే అసలు సిసలు పండగలా భావిస్తుంటారు. పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌ (Allu Arjun) హంగామా షురూ కానుంది. ఆయన కథానాయకుడిగా ‘పుష్ప: ది రూల్‌’  (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఇదివరకే విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్‌తోపాటు, లుక్‌ని విడుదల చేయనున్నారు. దానిపై దర్శకుడు సుకుమార్‌, కథానాయకుడు అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8న. ఒక రోజు ముందే ప్రచార చిత్రాల్ని విడుదల చేసే ఆలోచనలో సినీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. తగ్గేదేలే...అంటూ తొలి భాగంలో సందడి చేశాడు అల్లు అర్జున్‌. మరి రెండో భాగంలో ఆయన హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని