Shriya: మేలో ‘మ్యూజిక్‌ స్కూల్‌’

శ్రియా శరణ్‌, శర్మాన్‌ జోషి ప్రధాన పాత్రల్లో పాపారావు బియ్యాల తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. దిల్‌రాజు నిర్మాత. సుహాసిని, ప్రకాష్‌రాజ్‌, షాన్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 29 Mar 2023 07:06 IST

శ్రియా శరణ్‌ (Shriya), శర్మాన్‌ జోషి ప్రధాన పాత్రల్లో పాపారావు బియ్యాల తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. దిల్‌రాజు నిర్మాత. సుహాసిని, ప్రకాష్‌రాజ్‌, షాన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దిల్‌రాజు హైదరాబాద్‌లో మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చదువు వల్ల పిల్లలపై ఎంత ఒత్తిడి పడుతుందనేది ఈ చిత్రంతో తెలియజేయనున్నాం. ఇదొక సీరియస్‌ పాయింట్‌ అయినా దాన్ని వినోదాత్మకంగానే చూపించారు దర్శకుడు. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. ఇందులో మొత్తం 11 పాటలున్నాయి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం పిల్లలపై చదువు పేరుతో ఒత్తిడిని పెంచేస్తున్నారు. ఫలితంగా వారిలో అభివృద్ధి కనిపించకపోగా.. అదే వారి ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోంది. ఈ విషయాన్ని మా చిత్రం ద్వారా సంగీత రూపంలో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు దర్శకుడు. ఛాయాగ్రహణం: కిరణ్‌ డియోహన్స్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని