Rana Daggubati: ‘యానిమల్‌’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్‌..

‘యానిమల్‌’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్‌లా కనిపించిందని రానా అన్నారు.

Published : 07 May 2024 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా (Rana), వెంకటేశ్‌ (Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సిరీస్ వచ్చిన తొలినాళ్లలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీన్ని ‘యానిమల్‌’తో పోలుస్తూ తాజాగా రానా కామెంట్‌ చేశారు. ‘‘ఎంతోమంది ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ని విమర్శించారు. ఇటీవల ‘యానిమల్‌’ విడుదలైంది. అది చూశాక.. ప్రేక్షకులకు ఆ సిరీస్‌లో నా పాత్ర చాలా డీసెంట్‌గా కనిపించింది. నేను ఎప్పుడూ మంచి కథలపైనే ఆసక్తి చూపుతాను. ఆ సిరీస్‌ ఒక కుటుంబంలో జరిగిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా దీన్ని తెరకెక్కించాం. నాకు ఈ స్టోరీ నచ్చింది కాబట్టే వెంటనే ఓకే చేశాను’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. రానా, ఆయన బాబాయ్‌ వెంకటేశ్‌ మొదటిసారి ఈ సిరీస్‌ కోసం స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌, క్రైమ్‌ డ్రామాగా వచ్చిన ఇందులో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ సిరీస్‌కు త్వరలోనే సీక్వెల్‌ రానుంది. మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామాతో ‘రానా నాయుడు-2’త్వరలో విడుదల కానున్నట్లు నిర్మాణసంస్థ తెలిపింది. దీనికి కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. లోకోమోటీవ్‌ గ్లోబల్‌ మీడియా పతాకంపై సుందర్‌ ఆరోన్‌ నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని