Adipurush: ప్రతి రామాలయానికి ఉచితంగా 101 ‘ఆదిపురుష్‌’ టికెట్లు

ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా.. చారిత్రక గాథ రామాయణం ఆధారంగా.. తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’.

Updated : 12 Jun 2023 11:09 IST

ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా.. చారిత్రక గాథ రామాయణం ఆధారంగా.. తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతోంది. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు విచ్చేస్తాడు అనే నమ్మకంతో.. ‘ఆదిపురుష్‌’ ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రముఖ ఈవెంట్స్‌ ఆర్గనైజింగ్‌ సంస్థ శ్రేయస్‌ మీడియా ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్లు ఇవ్వదలచుకున్నామని ఆదివారం ప్రకటించింది. తన సొంత డబ్బులతోనే ఈ టికెట్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్‌ మీడియా అధినేత శ్రీనివాస్‌ మీడియాతో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని