Vaishnavi Chaitanya: ఆ ఇద్దరి సరసన వైష్ణవి చైతన్య

‘బేబి’ సినిమాతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న కథానాయిక... వైష్ణవి చైతన్య. అచ్చమైన ఈ తెలుగందం నటనతోనూ తిరుగులేదని చాటి చెప్పింది. ఇప్పుడు కొత్త అవకాశాల విషయంలోనూ జోరు ప్రదర్శిస్తోంది.

Updated : 06 Sep 2023 08:37 IST

‘బేబి’ సినిమాతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న కథానాయిక... వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). అచ్చమైన ఈ తెలుగందం నటనతోనూ తిరుగులేదని చాటి చెప్పింది. ఇప్పుడు కొత్త అవకాశాల విషయంలోనూ జోరు ప్రదర్శిస్తోంది. యువ కథానాయకులు సిద్ధు జొన్నలగడ్డ, ఆశిష్‌ సినిమాల్లో కథానాయికగా వైష్ణవి చైతన్య ఎంపికైంది. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఇటీవలే ఓ చిత్రం మొదలైన విషయం తెలిసిందే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ఇందులో కథానాయికగా వైష్ణవి చైతన్యని ఎంపిక చేశారు. ఆశిష్‌ కథానాయకుడిగా అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో చిత్రం కూడా ఇటీవలే మొదలైంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగార్జున మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకీ వైష్ణవి చైతన్య పచ్చజెండా ఊపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు