Turbo: ‘టర్బో’ జోస్‌ వచ్చేది జూన్‌లో

‘భ్రమయుగం’లోని తన నటనతో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసి ఈ ఏడాదిని విజయవంతంగా మొదలుపెట్టారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి.

Updated : 16 Apr 2024 09:25 IST

భ్రమయుగం’లోని తన నటనతో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసి ఈ ఏడాదిని విజయవంతంగా మొదలుపెట్టారు మలయాళ అగ్రకథానాయకుడు మమ్ముట్టి. కథ మాత్రమే కాదు.. పాత్ర ఏదైనా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఈసారి ‘టర్బో’ కోసం యాక్షన్‌ అవతారంలో వచ్చేందుకు తేదీని ఖరారు చేసుకున్నారీయన. వైశాక్‌ దర్శకత్వంలో రానున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమే ఈ ‘టర్బో’. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై రూపొందుతోందీ చిత్రం. ఇందులో టర్బో జోస్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా జూన్‌ 13న విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ఆ పోస్టర్‌లో వాహనంపై కూర్చొని, రాయల్‌ లుక్‌లో కనిపిస్తున్న మమ్ముట్టి చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నారు. తెలుగు నటుడు సునీల్‌, అంజనా జయప్రకాశ్‌, రాజ్‌ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని