Seetimaarr: గోపీచంద్‌ ‘సీటీమార్‌’ విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడంటే?

Seetimaarr:గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘సీటీమార్’ విడుదల తేదీ ఖరారైంది

Updated : 28 Aug 2021 17:44 IST

హైదరాబాద్‌: గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. వేసవి కానుకగా రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. గోపీచంద్‌ నుంచి కోరుకునే మాస్అంశాలతో పాటు, భావోద్వేగాలను కూడా జోడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశి, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని