Jailer 2: ‘జైలర్‌2’ సిద్ధమా?

2023లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘జైలర్‌’ ఒకటి. రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు. బాక్సాఫీస్‌ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసిందీ చిత్రం. రూ. 600  కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం కొనసాగింపు కోసం రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Updated : 22 Jan 2024 11:02 IST

2023లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ‘జైలర్‌’ ఒకటి. రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు. బాక్సాఫీస్‌ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసిందీ చిత్రం. రూ. 600  కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం కొనసాగింపు కోసం రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ‘జైలర్‌ 2’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతోంది. దర్శకుడు నెల్సన్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేసే పనిలో ఉన్నారని, ఇదొక ఫ్రాంచైజీగా మారనుందనేది తమిళ సినీవర్గాల మాట. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ అనే సినిమా చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ‘జైలర్‌ 2’ పట్టాలెక్కే అవకాశాలున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని