Rebels of Thupakulagudem: వంద అబద్ధాలతో..

పేరు కుమార్‌. వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలనే పెద్దల మాటని సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ మాటే స్ఫూర్తిగా వంద అబద్ధాలు ఆడాడు.

Updated : 28 Nov 2022 06:52 IST

పేరు కుమార్‌. వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలనే పెద్దల మాటని సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ మాటే స్ఫూర్తిగా వంద అబద్ధాలు ఆడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ‘రెబల్స్‌ ఆఫ్‌ తుపాకులగూడెం’ (Rebels of Thupakulagudem) చూడాల్సిందే. ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్‌ రాథోడ్‌, జయేత్రి మకానా, శివరామ్‌రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. సంతోష్‌ మురారికర్‌ కథతో, దర్శకుడు జైదీప్‌ విష్ణు తెరకెక్కించారు. వారధి క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు హను రాఘవపూడి విడుదల చేశారు. ‘‘తుపాకుల గూడెం చుట్టూ సాగే కథ ఇది. వంద మంది కలిసి వంద అబద్ధాలు మాత్రమే చెప్పారా లేక, ఇంకా ఏమైనా చేశారా? అనే విషయాలు ఆసక్తికరం. కొత్త రకమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సినిమా టీజర్‌ చూసి హను రాఘవపూడి మెచ్చుకున్నార’’ని సినీవర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ అర్పుల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని