Kalyanram: పవర్‌ఫుల్‌ టైటిల్‌తో కొత్తసినిమా

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని చిత్రబృందం....

Updated : 29 May 2021 07:18 IST

ఆకట్టుకునేలా మోషన్‌ పోస్టర్‌

హైదరాబాద్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శుక్రవారం నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని చిత్రబృందం ప్రకటించింది. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం షేర్‌ చేసింది. తనపై దండెత్తి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కల్యాణ్‌రామ్‌ కనిపించారు.

వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌కు జంటగా కేథరిన్‌, సమ్యుక్తా మేనన్‌ నటించనున్నారు. చింతరంజన్‌భట్‌ స్వరాలు అందించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కె.హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని